పొద్దుటూరు ప్రగతి రిసార్ట్స్ లో సోమయాగ ఉత్సవాలు

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని పొద్దుటూరు ప్రగతి రిసార్ట్స్ లో శుక్రవారం ఐదవ రోజు యాగ ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు సుబ్రహ్మణ్యం ఆహ్వానం, తృతీయ చితి పదానం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ప్రగతి సుధమ ఆధ్వర్యంలో ప్రకృతి మాత ఫౌండేషన్ ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీ వరకు ఈ ఆగం కొనసాగుతున్నది.

93 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ సోమయ్య గారికి అందరూ విచ్చేసి విఘ్నేశ్వరుని కృపకు పాత్రులు కావాలని ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జిబికే రావు అన్నారు. శ్రీ యమ వరం దీక్షిత అనంత కృష్ణ వాజపేయ యాజి ఆధ్వర్యంలో ఈ సోమయాగ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి గ్రూప్ ఎండి అజయ్ చంద్ర, డైరెక్టర్ రామకృష్ణ, ప్రొఫెసర్ రామన్ నాయక్, గీత, రెడ్డి( ఢిల్లీ) డాక్టర్ రవీందర్, ఎస్. వేణుగోపాల్, కె.రాఘవరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.