మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
* బీజేపీ చేవెళ్ల నాయకులు తొండ రవి

రచ్చబండ, శంకర్ పల్లి: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చేవెళ్ల భారతీయ జనతా పార్టీ నాయకులు తొండ రవి పిలుపునిచ్చారు. శుక్రవారం శంకర్ పల్లి మండల పరిధిలోని దొంతంపల్లి వద్ద మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఇండ్ల ముందు ఖాళీ స్థలాలు ఉంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలని తెలిపారు.

రైతులు పొలం గట్లపై మొక్కలు నాటాలన్నారు. మొక్కలు పెద్దవై చెట్లుగా మారితే వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. చెట్లు కార్బన్డయాక్సైడ్ ని పీల్చి ఆక్సిజన్ మానవాళికి అందిస్తాయని చెప్పారు. భావితరాల కోసం చెట్లను వీరి వీరి గా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గీత, గ్రామపంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.