శంకర్ పల్లి పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి

శంకర్ పల్లి పట్టణాభివృద్ధికి నిరంతరం కృషి
* మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు లో అండర్ డ్రైనేజ్ పనులను వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మునిసిపాలిటీలోని అన్ని వార్డులలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కడపడితే అక్కడ రోడ్లపై చెత్తాచెదారం వేయకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి.

శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ యూత్ ప్రెసిడెంట్ జూలకంటి పాండురంగారెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.