హైదరాబాద్ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనయుడు నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు చిరంజీవిని కలిశారు. ఆయన నయన్ తో కేకు కట్ చేయించి స్వీటు అందజేశారు. అభిమాన నటుడి వద్ద పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా నయన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.