తెలంగాణాలో సర్వమతాలకు సమాన గౌరవం

తెలంగాణాలో సర్వమతాలకు సమాన గౌరవం
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
* అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
* ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

రచ్చబండ, శంకర్ పల్లి: తొలి ఏకాదశి, బక్రీద్ పండుగలు సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకర్ పల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు గురువారం నిర్వహించారు. అనంతరం బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్ని మతాల వారిని మానవత్వంతో గౌరవిస్తున్నారని చెప్పారు. దేవాలయాలతో పాటు మసీదులు, ఈద్గాలను, చర్చలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పండుగలను కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, మున్సిపల్ యూత్ అధ్యక్షుడు జూలకంటి పాండురంగారెడ్డి సయ్యద్ ముంతాజ్, ఎండి. జాకీర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు మహమూద్ తదితరులు పాల్గొన్నారు.