కోదాడ అసెంబ్లీ సీటుపై ఎన్ఆర్ఐ గురి

* రాజకీయ నేపథ్యమున్న కుటుంబం
* ఆర్థికంగా, సామాజికంగా, బలమైన స్థాయి
* ఫౌండేషన్ తరఫున గత కొన్నాళ్లుగా ప్రజాసేవ
* రంగప్రవేశం సిద్ధం చేసుకునే పనిలో యువనేత

రచ్చబండ, సూర్యాపేట ప్రతినిధి : త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఓ యువనేత రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఉన్నత విద్యావంతుడైన ఆయనది రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. బలమైన సామాజికవర్గానికి చెంది, ఆర్థికంగా ఉండి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ రంగన్రవేశం చేయాలనుకుంటున్నారు. కోదాడ ప్రజల మన్ననలు సొంతం చేసుకునేందుకు నుంచే పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఈ ప్రాంత ప్రధాన నాయకులతో చర్చలు జరుపుతున్నారు.

అమెరికా డల్లాస్ లో ఓ ప్రముఖ కంపెనీ నడుపుతున్న ఆయన ఇక్కడి రాజకీయ ముఖచిత్రంలోకి రానున్నారు. చలసాని ఫౌండేషన్ పేరిట గత కొన్నాళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న ఆ యువనేతే చలసాని రాజీవ్. సూర్యాపేట జిల్లా కేంద్రంగా సుధీర్ఘకాలంగా జర్నలిస్టుగా, జర్నలిస్టు సంఘం నేతగా, రాజకీయ నేతగా గుర్తింపు కలిగిన  చలసాని శ్రీనివాసరావు వారసుడే ఈ రాజీవ్.

ఆయన నాయనమ్మ చలసాని జగదాంబ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల మహిళా నేతగా సేలందించారు. హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన జగదాంబ గతంలో రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ గా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, హుజూర్ నగర్ సమితి సభ్యురాలిగా విశేష సేవలందించారు. ఆమె, తన తండ్రి రాజకీయ వారసత్వంగా రాజీవ్ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు.

ఎన్నో ఏళ్లుగా ఎందరికో మంచి ఉపాధి మార్గాలను కల్పించి, ఎందరికో తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశేషమైన సేవలు అందించారు రాజీవ్. అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా.. ప్రజా సేవే ధ్యేయంగా ప్రత్యేక్ష ఎన్నికల బరిలో నిలిచి తన భవితవ్యాన్ని తేల్చుకునేందుకు సిద్దపడుతున్నారు. నాయనమ్మ చలసాని జగదాంబ రాజకీయ నేపథ్యం.. తండ్రి చలసాని శ్రీనివాసరావు నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న చలసాని రాజీవ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి తనదైన శైలిలో ముందడుగు వేసేందుకు ముమ్మరమైన ఏర్పాట్లు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న ఓ సామాజిక వర్గానికి చెందిన రాజీవ్ కు అన్ని సమీకరణాలు అనుకూలించి యువ నేతగా ప్రజల ఆశీస్సులు పొందే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.