చేవెళ్ల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి రెడీ

చేవెళ్ల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీకి రెడీ

* సీనియర్ రాజకీయ నేత శేరి నరసింగరావు

రచ్చబండ, శంకర్ పల్లి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీలో ఉంటానని చేవెళ్ల మండలం మోడిమ్యాల గ్రామానికి చెందిన సీనియర్ నేత శేరి నర్సింగరావు తెలిపారు. శనివారం ఆయన శంకర్ పల్లిలోని గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. త్వరలోనే ఏ పార్టీ నుండి పోటీలో ఉంటానో.. ఆ పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు.

ఎన్నికల సమయం వచ్చేవరకు గ్రామాల్లో తన అనుచరులతో కలిసి తన అభిప్రాయాలను వివరిస్తానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందని ఆయన తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తనకు అందరితో పరిచయాలు ఉన్నాయని చెప్పారు. నరసింగరావుకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి నర్సింగరావు. అందుకే ఈసారి చేవెళ్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ లో ఉంటానని తెలిపారు.

త్వరలోనే ఏ పార్టీ నుండి పోటీ చేసే అవకాశం ఉంటుందో తెలుపుతానంటున్నారు.