వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి

వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి
* బీఆర్ఎస్ శ్రేణులకు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పిలుపు

రచ్చబండ, శంకర్ పల్లి : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి కేసీఆర్ మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా రావడానికి తీవ్రంగా కృషి చేయాలని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం గ్రామ ఉపసర్పంచ్, మండల టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు బొల్లారం ఇంద్రసేనారెడ్డి తన జన్మదిన సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి ఆశీర్వాదాలు పొందారు.

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంద్రసేనారెడ్డి మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆశీర్వదించారు.