నేను ఒంటరి మహిళను.. మీతో చాట్ చేయాలనుకుంటున్నాను.. ముందుగా మెసేజ్ పంపేవారికే ఛాన్స్.. అంటూ వచే్చ మెసేజ్‌లకు స్పందించారో మాయాజాలంలో చిక్కకున్నట్లే.. కొందరు అమాయకులు ఇలాంటి మెసేజ్‌లకు పడిపోయి నగదు పోగొట్టుకున్న వారెందరో ఉన్నారు. కానీ ఒక యువకుడు ప్రాణాన్నే బలి తీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు (22) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ వృత్తి విద్యనభ్యసిస్తున్నాడు. ఇటీవల అతడి ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. నేను ఒంటరి మహిళను, మీతో చాట్ చేయాలనుకుంటున్నాను.. అని ఆ మెసేజ్‌లో ఉంది. వెంటనే ఆ యువకుడు మెసేజ్ వచ్చిన నెంబర్‌కు ఏకంగా కాల్ చేశాడు. ఆ నెంబర్ ఎత్తిన ఓ యువతి కవ్విస్తూ మాట్లాడింది. ఆ తర్వాత నగ్నంగా ఓ యువతి ఫోన్ చేసి నగ్నంగా కనిపిస్తూ సెల్లో ఛాటింగ్ చేసింది. నగ్న విషయాలపై ఆయువకుడినీ ప్రేరేపించింది. ఆ ఫొటోలను ఆ యువతి రికార్డు చేసింది.
అదే ఆ యువకుడిని బలితీసుకుంది..
నగ్న వీడియోలు చూసినప్పటి నుంచి సదరు యువకుడిని డబ్బులు పంపాలంటూ కాల్స్ వచ్చేవి. సదరు యువకుడు స్పందించకపోవడంతో ఆ నగ్న వీడియోలను యూట్యూబ్‌లో పెడతామంటూ ఆ యువతి ముఠా సభ్యులతో కలిసి బెదిరింపులకు దిగింది. భయపడిన అతను తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.24 వేలను అవతలి వ్యక్తుల అకౌంట్‌కు పంపాడు. అయినా వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బులు పంపాలంటూ మళ్లీ మళ్లీ ఫోన్ కాల్స్ చేస్తుంటడంతో ఇటీవలే సొంతూరికి వెళ్లాడు. తెల్లారాక ఉదయం తమ పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించగా, హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గత నెల 30న ఆ యువకుడు మృతి చెందాడు. అతడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు.