గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.
రచ్చబండ, శంకర్ పల్లి: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.
మంగళవారం శంకర్ పల్లి మండలం మోకిలా- టంగుటూరు గ్రామాల మధ్య మూసీ నదిపై రూ. 14 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో పచ్చదనం వెళ్లి విరీయడానికి సీఎం కేసీఆర్ కారణమన్నారు.
పల్లె ప్రకృతి పనాలతో ప్రతి గ్రామం పచ్చదనంతో నిండిపోయిందని తెలిపారు. అలాగే గ్రామాలలో అండర్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్ల పనులు జరిగాయని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలలో ప్రతి ఇంటికి నల్లాలు ఏర్పాటు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో గోపులారం గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాస్, పొద్దుటూరు గ్రామ మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.