- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- శంకర్ పల్లి పీఏసీఎస్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక
- పెద్ద ఎత్తున అనుచరుల చేరిక
రచ్చబండ, శంకర్ పల్లి: రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామానికి చెందిన స్థానిక పీఏసీఎస్ డైరెక్టర్ కాడి గారి రాజశేఖర్ రెడ్డి సుమారు 100 మంది తన అనుచరులతో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి వారిని ఆదుకుందని గుర్తు చేశారు. మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల వలె కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజర్ సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేష్ రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, విటల్ రెడ్డి, రాంరెడ్డి, గౌస్ రాజు తదితరులు పాల్గొన్నారు.