గెలుపోటములు సహజం

గెలుపోటములు సహజం
* చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
* ముగిసిన సీఎం కప్ క్రీడలు

రచ్చబండ, శంకర్ పల్లి: గెలుపు ఓటములు సహజమని, క్రీడలలో ఓడినవారు మళ్లీ గెలవడానికి ప్రయత్నం చేయాలని రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్ పల్లి మండలం మోకిలా గ్రామ క్రీడా ప్రాంగణంలో మూడు రోజులుగా జరిగిన సీఎం కప్ క్రీడల ముగింపు సమావేశం జరిగింది. క్రీడలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులను అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలలో గెలుపు ఓటములు సహజమని ఓడినవారు నిరాశ చెందకుండా మళ్లీ గెలవడానికి ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. క్రీడలలో వాలీబాల్ బాలుర విభాగంలో మోకిలా తండా ప్రథమ బహుమతి గెలుచుకుంది. బాలికల విభాగంలో పొద్దుటూరు గ్రామానికి చెందిన జట్టు ప్రథమ బహుమతి గెలుచుకుంది.

కబడ్డీ లో ఇరుక్కుంట తండా కు చెందిన బాలురు మొదటి బహుమతిని గెలుచుకున్నారు. బాలికల విభాగంలో ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన జట్టు మొదటి బహుమతి గెలుచుకుంది. కోకోలో మోకిలా తాండాకు చెందిన బాలురు మొదటి స్థానం గెలవగా, బాలికల విభాగంలో జనవాడ జట్టు మొదటి బహుమతి గెల్చుకుంది. అథ్లెట్స్ లో వి. వంశీ, దివ్య మొదటి బహుమతులు గెలుచుకున్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ భానుర్ వెంకటరామిరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, ఎంపీడీవో వెంకయ్య, ఈఓఆర్డి గీత, మోకిలా గ్రామ సర్పంచ్ సుమిత్ర మోహన్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.