కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
రచ్చబండ, శంకర్ పల్లి: కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. స్థానిక సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శంకర్పల్లి మండల పరిధిలోని మహారాజ్ పేట గ్రామానికి చెందిన మోతె రాములు (42) గత నాలుగు నెలలు నుండి కడుపునొప్పితో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నాడని, ఆరోగ్య సమస్యలతో బాధపడేవాడని తెలిపారు.
కాగా బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.