ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ముఖద్వారాలు ప్రారంభం

రచ్చబండ, కంటోన్మెంట్ : సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ముఖ ద్వారాలను మంత్రులు ప్రారంభించారు. బోనాల సమయంలో భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా ముఖద్వారాలను తీర్చిదిద్దారు. వాటిని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ముఖ ద్వారాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్ట బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ముప్పిడి గోపాల్, కంటోన్మెంట్ సికింద్రాబాద్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.