ఈసారీ ఆయనే బీఆర్ఎస్ చేవెళ్ల అసెంబ్లీ అభ్యర్థి
* గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్
రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాలే యాదయ్యకే టికెట్ వస్తుందని శంకర్ పల్లి మండలం గోపులారం సర్పంచ్ పొడవు శ్రీనివాస్, దొంతంపల్లి సర్పంచ్ అశ్విని సుధాకర్లు అన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని మడ్డిపడ్డారు.
సీఎం కేసీఆర్ ఈసారి చాలామంది సెట్టింగ్లకే పార్టీ టికెట్టు ఇస్తానని చెప్పిన కొందరు నాయకులు పనిగట్టుకొని టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేస్తూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గం లో గత తొమ్మిది సంవత్సరాలలో సీఎం కేసీఆర్ సహకారంతో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎంతో అభివృద్ధి చేస్తూ అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చేశారని కొనియాడారు.
ఈసారి చేవెళ్ల నియోజకవర్గం నుండి కాలే యాదయ్య భారీ మెజార్టీతో గెలుపొందుతారని వారు తెలిపారు. ఈ సమావేశంలో ఇరుక్కుంటా తండా ఉపసర్పంచ్ లక్ష్మణ్ నాయక్, దొంతంపల్లి ఉప సర్పంచ్ ఆజిమ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.