మరో ఉద్యమానికి యుద్యోగులు సిద్ధం కావాలి

మరో ఉద్యమానికి యుద్యోగులు సిద్ధం కావాలి
* టీఎస్పీపీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు తాహెర్ అలీ
* రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

రచ్చబండ, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సిపిఎస్ఈయు) రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో పాత పెన్షన్ సంకల్ప యాత్ర కు సంబంధించిన గోడపత్రికను గురువారం ఉద్యోగులు, సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తాహెర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం ఉద్యోగులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

సిపిఎస్ విధానం అంటే నా దృష్టిలో పెన్షన్ స్కీం లాగా లేదని, ఇది ఒక కంపు పెన్షన్ విధానమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2004లో జీవో 1 తీసుకువచ్చి ఉద్యోగులకు ఉరితాడుగా తయారు చేసిందని అన్నారు. ఈ సిపిఎస్ అనే మహమ్మారిని తరిమికొట్టడానికి అందరం ఏకతాటి పై రావాలని పిలుపునిచ్చారు. పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దర్శన్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షులు అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి దూత కృష్ణ, కలెక్టరేట్ ఉద్యోగులు విక్రమ్, యాసీన్, వినోద్, గాయత్రి, శరణ్య, గౌతమ్, విక్రమ్, నవాబ్, చంద్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.