మహరాజ్ పేటలో భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ

మహరాజ్ పేటలో భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ

రచ్చబండ, శంకర్ పల్లి : శంకర్ పల్లి మండలంలోని మహరాజ్ పేట్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో, ఘనంగా బోనాల పండుగను గ్రామస్తులు జరుపుకున్నారు. శివసత్తుల ఆటలతో, పోతరాజుల విన్యాసాలతో బోనాల ఊరేగింపు గురువారం రాత్రి నిర్వహించారు.

ఈ బోనాల కార్యక్రమాలు సర్పంచ్ దోసాడ నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి అపశృతులు కలుగకుండా ప్రజలు శాంతియుతంగా బోనాల పండుగను ప్రజలు జరుపుకున్నందుకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగను ఇలాగే ప్రజలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీకాంత్, గడ్డం రవి గ్రామస్తులు పాల్గొన్నారు.