వనపర్తిటౌన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి.. ఆదర్శ వనిత అని వక్తలు కొనియాడారు. వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాలలో టీజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రమాబాయి అంబేద్కర్ 87వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయకారుడు రాజా రామ్ ప్రకాష్ మాట్లాడారు.
రమాబాయి తాను కష్టపడి పనిచేయగా వచ్చిన డబ్బుతో అంబేద్కర్ విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోడానికి సహాయ సహకారాలు అందించిన మానవతామూర్తి అని అన్నారు.
ఈ తరం మహిళలకు ఆమె స్ఫూర్తి ప్రదాత కొనియాడారు. కడుపు నింపుకోవడానికి కూలిపపేలే చేస్తూ పిడకలు ఆమ్ముకొని జీవనం కొనసాగిస్తూనే భర్త ఆశయసాధనలో కళ్లముందు కన్నబిడ్డలు మరణిస్తున్నా ఆ కన్నీటిని కడుపులోనే దాచుకుని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను చదివించి ప్రపంచ జ్ఞాని గా మార్చిన రమాబాయి మహిళలకు స్ఫూర్తి అన్నారు.
ఈ కార్యక్రమంలో కవి పండితుడు బూరోజు గిరిరాజ చారి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగవుల వెంకటస్వామి, శాలివాహన సంఘం జిల్లా నాయకుడు కోనింటి వెంకటేశ్వర్లు, కళాకారుడు నందిమల్ల డప్పు నాగరాజు, బుడగ జంగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు గగనం శేఖర్, గంగపుత్ర సేవా సంఘం జిల్లా నాయకుడు టీ కొట్టు బాలు తదితరులు పాల్గొన్నారు.