అయ్యప్ప స్వామి ఆలయానికి భారీ విరాళం
* రూ.70,101 అందించిన బీజేపీ అధ్యక్షుడు రాములుగౌడ్
రచ్చబండ, శంకర్ పల్లి; రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి భారతీయ జనతా పార్టీ శంకర్ పల్లి మండల అధ్యక్షుడు బసగాళ్ల రాములు గౌడ్ మంగళవారం అయ్యప్ప దేవాలయ కమిటీ సభ్యులకు రూ.70,101 వేలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడ లేనటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని భక్తులు నిర్మించారని తెలిపారు. శంకర్ పల్లి పట్టణానికే ఒక శోభల ఈ దేవాలయం నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు దండు మోహన్, ప్రవీణ్ కుమార్, గుండా శేఖర్, బిర్లా సురేష్, మణి గార్డెన్స్ శ్రీనివాస్ పాల్గొన్నారు.