అటెండర్ రాజు కుటుంబానికి రూ.60 వేలు అందించిన టీయూటీఎఫ్
రచ్చబండ, శంకర్ పల్లి : ఇటీవల ఎం ఆర్ సి శంకర్ పల్లి లో అటెండర్ గా పనిచేస్తున్న రాజు అకాలం మృతి చెందడం బాధాకరమని శంకర్ పల్లి మండల తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో రాజు కుటుంబ సభ్యులకు సేకరించిన విరాళాలు.
60 వేల రూపాయలు మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ టి యు టి ఎఫ్ మండల శాఖ చొరవ తీసుకొని మండలంలో ఉన్న సంఘ సభ్యులు, శ్రేయోభిలాషుల నుండి రూ.60,000 సేకరించి కుటుంబానికి అందించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మునీర్ పాషా, నారాయణ, సరస్వతి, మండల అధ్యక్షులు ఏ. సుదర్శన్, కార్యదర్శి వి.శ్రీనివాసచారి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మొగులయ్య, జగదీష్, వరప్రసాద్, మోహన్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మహేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, సరస్వతి, గిరిజ, వాసంతి తదితరులు పాల్గొన్నారు.