కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
రచ్చబండ, శంకర్ పల్లి; రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని కొండకల్ గ్రామ శివారులో నిర్మించిన ప్రైవేటు మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించనున్నారు. మంగళవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శంకర్ పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకొని చేపట్టాల్సిన భద్రతా విషయంలో పోలీసులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, డిసిపి జగదీశ్వర్ రెడ్డి, నార్సింగి ఏసిపి రమణ గౌడ్, స్థానిక సీఐ ప్రసన్నకుమార్, మోకిలా పోలీస్ సిఐ నరేష్, ఎస్సైలు కృష్ణ, సంతోష్ రెడ్డి, కృష్ణయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.