హుజూర్ నగర్ న్యాయవాది సుంకర ప్రదీప్తికి అరుదైన అవకాశం
* ఉచిత న్యాయ సలహాదారుల న్యాయవాదిగా నియామకం
రచ్చబండ, హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల్ కేంద్రానికి చెందిన సీనియర్ మహిళా న్యాయవాది సుంకర ప్రదీప్తికి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ నుంచి అరుదైన అవకాశం లభించింది. హుజూర్ నగర్ న్యాయ సేవాధికార సంస్థలో ప్యానల్ న్యాయవాదిగా పనిచేస్తున్న సుంకర ప్రదీప్తి ఉచిత న్యాయ సలహాదారుల న్యాయవాదిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రెటరీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హుజూర్ నగర్ న్యాయవాదుల ప్యానెల్ నుంచి ఐదుగురు న్యాయవాదులకు ఈ అవకాశం దక్కగా వారిలో ప్రదీప్తి ఒకరు. స్వతహాగా న్యాయవాదిని నియమించుకోలేని వారికి చైర్మన్ ఆదేశాల మేరకు ఉచిత న్యాయవాదిగా వారి తరఫున వాదించవలసి ఉంటుంది. అలాగే న్యాయ సేవా సంస్థకు సంబంధించిన అన్ని కార్యక్రమాలలో భాగస్వామ్యం ఉంటుంది. న్యాయవాది సుంకర ప్రదీప్తికి ఈ అవకాశం దక్కడం పట్ల పట్టణ ప్రజలు, న్యాయవాదుల సంఘం ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.