యువకులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరం

యువకులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరం

* శంకర్ పల్లి పీఏసీఎస్ డైరెక్టర్ కాడి గారి రాజశేఖర్ రెడ్డి
రచ్చబండ, శంకర్ పల్లి: గ్రామాల్లో యువకులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని శంకర్ పల్లి పీఏసీఎస్ డైరెక్టర్, మహాలింగాపురం గ్రామవాసి కాడి గారి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో శివాజీ సేన యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ఆయన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు మండపంలో ప్రతిష్టించిన వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వినాయక నిమజ్జనాన్ని గ్రామస్తులు, యువకులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివాజీ సేన యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.