యాదాద్రి వెళ్తున్నారా!

కొండపైకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

ఒకనాటి యాదగిరిగుట్టను యాదాద్రిగా పునర్నిర్మాణం చేసి ఇటీవలే నూతన ఆలయాన్ని ప్రారంభించారు. భక్తుల దర్శనానికి అనుమతినివ్వడంతో రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటకతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలివస్తున్నారు.

అయితే కొండపైకి భక్తుల వాహనాలకు నిషేధం విధించారు. ఈ మేరకు యాదాద్రికి వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ఒక సువర్ణ అవకాశం కల్పించింది. ఆర్టీసీ బస్సులో ఉచితంగా కొండపైకి తీసుకెళ్లి, తిరిగి తీసుకొస్తుంది.

దేవస్థానానిదే ఖర్చు

ఇప్పటికే యాదాద్రి కొండపైకి ఉచిత ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల రాకపోకలకు అయ్యే ఖర్చును దేవస్థానమే భరిస్తుంది.

ప్రైవేటు వాహనాల నిషేధం

ఆలయానికి వచ్చే భక్తులు కొండపైకి ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు నిషేధం విధించింది. బైకులు, కార్లు, జీపులు, ప్రైవేటు బస్సులు వెళ్లకుండా నిషేధం విధించినట్లు దేవస్థానం ప్రకటించింది. నిత్యం కొండపైకి, దిగువకు రాకపోకల కోసం ఆర్టీసీ సేవలందించనుంది.