సూర్యాపేట జిల్లాలో దారుణం.. భార్యను హతమార్చిన భర్త

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన భర్త చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఓ తండాలో జరిగిన ఈ ఘటనపై గ్రామంలో విషాదం నెలకొంది.

జిల్లాలోని చివ్వెంల మండలం బాధ్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్య భూక్య తండాలో భూక్య సైదా తన భార్య సక్కు(38)ను రోకలితో తలపై కొట్టి చంపాడు. అనంతరం అతను పరారయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.