సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు సస్యశ్యామలం.

సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు సస్యశ్యామలం.

-శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

రచ్చబండ, శంకర్ పల్లి; ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో రాష్ట్రంలోని గ్రామాలని సస్యశ్యామలమవుతున్నాయని శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు డి. గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని జనవాడ, పొద్దుటూరు గ్రామాలలో ఊరూరా చెరువు పండుగ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీపీ హాజరై మాట్లాడుతూ 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు.

మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాలలో త్రాగునీటి సమస్యను తీర్చారని చెప్పారు. అలాగే మిషన్ కాకతీయ పథకంతో గ్రామాలలో ఉన్న చెరువులను బాగు చేయించారని తెలిపారు. చెరువులలో పూడికలు తీయడంతో చెరువుల సామర్థ్యం పెరిగిందని చెప్పారు. వీటితోపాటు రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి వారికి చేయూతనిస్తున్నారని తెలిపారు. వితంతువులకు, వృద్ధులకు నెల నెల పింఛన్లు అందించి వారి కళ్ళలో ఆనందాలను నింపుతున్నారని కొనియాడారు.

వీటితోపాటు ఇటీవల దళిత బంధు ప్రవేశపెట్టి దళితులకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనాలు , బతుకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, తహసిల్దార్ మొయినుద్దీన్, ఎంపీడీవో వెంకయ్య, శంకర్ పల్లి ఏఎంసీ చైర్మన్ మారేపల్లి పాపారావు, సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి, ఎంపీటీసీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి, ఈ ఓ ఆర్ డి గీత, ఏపీఎం భీమయ్య, మాజీ ఎంపీటీసీ బొల్లారం వెంకటరెడ్డి, నాయకులు ఈ. సుధాకర్ రెడ్డి, కొత్తపల్లి ఎంపీటీసీ శోభా, గ్రామస్తులు పాల్గొన్నారు.