మల్కాపురంలో దళితులను చితకబాదిన వారిని అరెస్టు చేయాలి

మల్కాపురంలో దళితులను చితకబాదిన వారిని అరెస్టు చేయాలి
• ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కోశాధికారి నర్సింలు

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపురం గ్రామంలో దళితులైన గుండు శివయ్య, గుండు సంజీవులపై దాడి చేసిన ఆ గ్రామ సర్పంచ్ శేరి శివారెడ్డి అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా కోశాధికారి నర్సింలు డిమాండ్ చేశారు.

సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత శనివారం బోనాల ఉత్సవాలు చూడటానికి వెళ్లిన ఇరువురిని సర్పంచ్ అతని అనుచరులు దాడి చేయగా వారు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. చేవెళ్ల సీఐ, ఎస్సైలు స్పందించి, బాధ్యులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

శేరి శివారెడ్డ.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అనుచరుడని, అందుకే అతనిని పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. వెంటనే వారిని అరెస్టు చేసి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.