శంకర్ పల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

శంకర్ పల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
• చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపాలిటీని జిల్లాలోని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య హామీ ఇచ్చారు. సోమవారం ఎమ్మెల్యే శంకర్ పల్లి మున్సిపాలిటీలోని వార్డుల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 14వ తేదీన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకర్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు.

జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి సమక్షంలో నిధుల మంజూరుపత్రాన్ని అందించారని చెప్పారు. మున్సిపాలిటీలోని వార్డులలో ఏ ఏ పనులు జరగాలో స్థానిక నేతల ద్వారా అడిగి తెలుసుకున్నారు. చేపడుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకై సీఎం కేసీఆర్ కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భానుర్ వెంకటరామిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, కౌన్సిలర్ గండేటి శ్రీనాథ్ గౌడ్, మండల బి ఆర్ ఎస్ పార్టీ బీసీ అధ్యక్షుడు మన్నె లింగం ముదిరాజ్, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, కౌన్సిలర్లుఅశోక్ కుమార్, చంద్రమౌళి, నాయకులు ప్రవీణ్ కుమార్, పార్శి బాలకృష్ణ, జూలకంటి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.