ఆవిర్భావం తర్వాతే తెలంగాణ యాస, భాష విలువ తెలిసింది
– హుజర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
‘అరి’ సినిమా లోగో, పోస్టర్ ఆవిష్కరణ
రచ్చబండ, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటయ్యాకే ఈ ప్రాంత యాస, భాషకు విలువ పెరిగిందని హుజర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హైదరాబాద్ లో అరి చలనచిత్ర లోగో, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. లోగో మరియు పోస్టర్ ని అవిష్యరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది తెలంగాణ నటీనటులకు అవకాశలు వస్తున్నాయని పేర్కొన్నారు. తద్వారా తెలంగాణ లోని స్కిల్డ్ పీపుల్స్ విలువ సినిమా రంగానికి తెలిసి వచ్చిందన్నారు. ఇవన్నీ తెలంగాణ ద్వారానే సాధ్యమయ్యాయని అన్నారు.
తెలుగు కథా నాయకి, నాయకులు అచ్చమైన తెలంగాణ యాసను మాట్లాడుతూ సినిమా విలువను పెంచుతున్నారని కొనియాడారు.
అందుకు మనం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి అనసూయ, అరి సినీ నటీనటులు పాల్గొన్నారు.