వీర సైనికుల త్యాగాలను స్మరించుకోవాలి.
ఎంపీడీవో, వెంకయ్య
నిఘా, శంకర్ పల్లి; దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీర మరణం పొందిన సైనికులను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని శంకర్ పల్లి ఎంపీడీవో వెంకయ్య, మొయినాబాద్ ఎంపీడీవో సంధ్య అన్నారు. గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మేరీ మాటి- మేరా దేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో తమ పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో ఎంపీ ఓ. గీత, సూపరిండెంట్ రవీందర్, ఏపీవో. నాగభూషణం, ఏపిఎం భీమయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఐకెపి సిబ్బంది యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత సైనికులు అశోక్ను శాలువాతో సత్కరించారు.