కాంగ్రెస్ కార్యకర్తల పై దాడులు చేస్తే సహించేది లేదు

కాంగ్రెస్ కార్యకర్తల పై దాడులు చేస్తే సహించేది లేదు

చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్.

నిఘా. శంకర్ పల్లి; కాంగ్రెస్ కార్యకర్తలపై బి ఆర్ ఎస్, బిజెపి పార్టీల నాయకులు దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ హెచ్చరించారు. గురువారం ఆయన శంకర్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో కార్యకర్తలతో మాట్లాడుతూ ఓడిపోతామని అసహనంతో కాంగ్రెస్ కార్యకర్తలపై టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాడులు చేస్తున్నారని తెలిపారు. ఇటీవల నవాబుపేటలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన యువకుల పై టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయగా వారిపై పోలీసు కేసులు పెట్టించామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు.

గత ఎన్నికల వాగ్దానంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని వాగ్దానం చేసి మరిచిపోయారని తెలిపారు. అమరుల త్యాగఫలం తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఒక కేసీఆర్ ఉద్యమం చేస్తే రాష్ట్రంలో రాలేదని చెప్పారు. సోనియా గాంధీ దయతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు గ్రామాలలో తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తుందని తెలిపారు. ఒకసారి తనకు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇవ్వాలని భీమ్ భరత్ ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అధ్యక్షులు ,చింపుల సత్యనారాయణ రెడ్డి, టి పి సి సి ఆర్గనైజర్ సెక్రెటరీ కె.ఉదయ మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి. జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై. ప్రకాష్ గుప్తా, శంకర్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ కాడి గారి రాజశేఖర్ రెడ్డి, మాజీ డైరెక్టర్ జంగయ్య, మైనార్టీ నాయకులు ఎండి ఎజాజ్, నాయకులు ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపిటిసి టి. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు గౌడ్ పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అంతకుముందు శంకర్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ కాడి గారి రాజశేఖర్ రెడ్డి తదితరులు భీమ్ భరత్ ను శాలువాలతో సత్కరించారు.