ఇక్కడి నుంచే షర్మిల మలివిడత పాదయాత్ర

గతేడాది తన తండ్రి చూపిన బాటలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చేనెలలో మలివిడత పాదయాత్ర చేపట్టనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, కొవిడ్ నిబంధనల కారణంగా గతేడాది నవంబర్ 21న ఆమ పాదయాత్రను నిలిపివేశారు.

వచ్చేనెల ఒకటి నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆమె మలి విడత పాదయాత్రను నల్లగొండ జిల్లా కొండపాకగూడెం గ్రామం నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను చేపట్టనున్నట్లు తెలిసింది.

రాబోయే ఎన్నికల వరకు దాదాపు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది.