రచ్చబండ, శంకర్ పల్లి: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్ లోని మంత్రి గృహములో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు పూల బొకేలు అందించి, శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, స్థానిక పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి, మున్సిపల్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వాసుదేవ్ కన్నా, మాజీ ఎంపీపీ మాల చిన్న నరసింహులు, మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, నాయకులు చేకూర్త గోపాల్ రెడ్డి, జూలకంటి రామ్ రెడ్డి, పార్సి బాలకృష్ణ, గోవర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ ఉపేందర్ రెడ్డి, సింగాపురం మాజీ సర్పంచ్ విఠలయ్య తదితరులు మంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కాగా జనవాడ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గౌడ చర్ల వెంకటేష్ తన అనుచరులతో మంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.