- శంకర్ పల్లి ఏఎంసీ మాజీ చైర్మన్ రాజునాయక్
రచ్చబండ, శంకర్ పల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతుల పాలిట దేవుడని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సభావత్ రాజునాయక్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా ఇస్తూ, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. మామూలు వరి ధాన్యానికి చెల్లించినట్లుగానే తడిసిన ధాన్యానికి కూడా ధర చెల్లిస్తామని చెప్పడం సీఎం కేసీఆర్ ఉదారత్వం అని అన్నారు.
వ్యవసాయాన్ని కాపాడుతూ కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఉండడం మనకు భాగ్యమన్నారు. రైతులతో పాటు గీతన్న లకు కూడా బీమా సౌకర్యం కల్పించడం సంతోషకరమన్నారు.
గీతా కార్మికులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించి వారిని ఆదుకుంటున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మనం మళ్లీ గెలిపించుకోవాలని చెప్పారు.