రంగారెడ్డి జిల్లా మోకిలలో మహిళల శారీరన్ విజయవంత
రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిలలో శారీ రన్ ఆదివారం నిర్వహించారు. మోకిలా రైతు వేదిక నుండి 3.5 కె, 5 కె శారీరన్, బ్రేకింగ్ వారియర్స్ విత్ స్టైల్ పేరుతో మహిళలకు, పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ రన్ నిర్వహించి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తిమ్మయ్య గారి వాణి, ప్రతిమ, ఆదిత్య మాట్లాడుతూ మంచి శారీరక, మానసిక ఆరోగ్యానికి మహిళలకు ప్రతిరోజు పరుగు, ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మహిళలందరినీ అభినందించారు.