త్వరలో ఖమ్మం జిల్లాకు ప్రకాశ్ రాజ్

మధిర : సినీ నటుడు ప్రకాష్ రాజ్ త్వరలో ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆయన రాక కన్ ఫామ్ అయింది. ఎప్పుడనేది తేలాల్సి ఉంది. జిల్లాలోని మధిర పట్టాణానికి త్వరలో వస్తారని ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు మల్లాది వాసు, సవిత దంపతులు శనివారం వెల్లడించారు.

హైదరాబాదులో నటుడు ప్రకాష్ రాజ్ నివాసంలో శనివారం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇరు కుటుంబాలు కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రకాష్ రాజ్ మంచి నటుడని, ఆయన అనేక విలక్షణమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారని అనంతరం మాట్లాడిన మల్లాది వాసు కొనియాడారు. ఈ సందర్భంగా మధిరలో పర్యటించాల్సిందిగా ప్రకాశ్ రాజ్ ను తాము కోరినట్లు తెలిపారు. దీనికి ప్రకాష్ రాజ్ సమ్మతించారని, త్వరలోనే మధిర పర్యటనకు వస్తానని హామీ ఇచ్చారని మల్లాది వాసు వెల్లడించారు.