25, 26 తేదీల్లో మ్యూజిక్ ఫెస్టివల్

రచ్చబండ, హైదరాబాద్ : “సైఫర్ హౌర్స్” ఆధ్వర్యంలో వాల్యూమ్ 11 పేరుతో అతిపెద్ద డాన్స్, మ్యూజిక్ ఫెస్టివల్ ను ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఫెస్టివల్ పోస్టర్ ని మనోహర్ రావు (టీఎస్టీడీసీ), సినీనటులు ఫరియా అబ్దుల్లా, సాన్వే మేఘన, సిద్దు జొన్నలగడ్డ, లక్ష్మి మంచు, సుశిమిత కొణిదల, సంగీత్ దర్శకుడు అనూప్ రూబెన్స్ లాంచ్ చేశారు.

ఈ నెల 25, 26లలో హైదరాబాద్ లోని ప్రిజం క్లబ్ లో ఈ ఈవెంట్ జరగనుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కళల ద్వారా ప్రజలు తమను తాము నిరూపించుకోవడానికి నిర్వహించే ఒకే ఒక వేదిక “సైఫర్ హౌర్స్” అని పేర్కొన్నారు. సినీనటి ఫరియా అబ్దుల్లా, హైదరాబాద్ కి చెందిన ప్రముఖ కళాకారిణి హర్ష మహేశ్వరి, సీరియల్ ఆర్టిస్ట్ రాజ్ జనగాం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ కు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

సైఫర్ హౌర్స్ ను నిర్వహించడంలో ఒక దశాబ్దం కాలం సుదీర్ఘ అనుభవంతో తమ బ్రాండ్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఉనికితో మొత్తం 3 మిలియన్లకు పైగా చేరుకున్నట్లు తెలిపారు. ఈ 11వ ఎడిషన్ లో సైఫర్ హౌర్స్ జాతీయ, అంతర్జాతీయ కళాకారులకు ఒక పెద్ద వేదికను అందిస్తుందని తెలిపారు.

కళ ద్వారా జీవితాన్ని జరుపుకోవాలనే ఆకాంక్షతో, సామూహిక అవగాహనను వ్యాప్తి చేస్తూ సమాజంపై లోతైన అర్థవంతమైన ప్రభావాన్ని ప్రేక్షకులకు అందించాలని అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు గురించి అవగాహన కల్పించాలని ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఒకే వేదికపై 75 కళల ప్రదర్శన
సైఫర్ హౌర్స్ జాతీయ, అంతర్జాతీయంగా ఎంతో పెరున్న కళాకారులను జడ్జ్ లుగా హైదరాబాద్ తీసుకువస్తున్నామన్నారు. సైఫర్ హౌర్స్ వాల్యూమ్ 11 ఈవెంట్ లో రాపర్లు, డాన్సర్లు, బీట్ బాక్సర్స్, డీజీలు, ఫోటోగ్రాఫర్లు, ఉపాధ్యాయులతో పాటు 75 కళలకు సంబంధించిన కళాకారులు ఒకే వేదికపై వారి కళలను నిరూపింకోనున్నారు.

ఈ కార్యక్రమంలో 18 మంది జడ్జీలు, వర్క్ షాప్స్, స్టాల్ల్స్, ఎక్సబిషన్ , డాన్సులు ఉంటాయన్నారు. ఈ ఈవెంట్ లో భాగంగా హైదరాబాద్ లో కొని ప్రదేశాల్లో మాల్స్, పబ్లిక్ ప్లేస్ లలో ఫ్లాష్ మాబ్ నిర్వహిస్తోందని తెలిపారు. ఇండియా లోని1 టాప్ డి జె టర్న్ బ్లీస్ట్ కావే, హిప్ హిప్ డి జె కెఎన్-ఐ, గల్లీ బాయ్ మూవీ టీమ్, ఫేమస్ డాన్స్ గ్యాంగ్ చేయనున్నామన్నారు. మరిన్ని వివరాల కోసం www.cypherhours.com మరియు 8977012146 ని సంప్రదించాలని కోరారు.