అయ్యప్ప ఆలయానికి 1.80 లక్షల విరాళం అందించిన మాశెట్టి రాఘవేందర్

రచ్చబండ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త మాశెట్టి రాఘవేందర్ కుటుంబ సభ్యులు బుధవారం దేవాలయ కమిటీ సభ్యులకు లక్ష 80 వేల రూపాయలు విరాళంగా అందించారు.

ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ దేవాలయానికి తన వంతు సహాయంగా రూ.1,80,000 అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సాతా ప్రవీణ్ కుమార్, జూలకంటి పాండురంగారెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు