ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకొంది. ప్రేమించిన యువతి గొంతుకోసి దుండగుడు పరారయ్యాడు. ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
సత్తెనపల్లి పట్టణంలోని యువతీ, యువకుడు గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. ఇటీవల ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు చోటుచేసుకున్నాయి. దీంతో వివాదం చెలరేగింది. దీంతో గురువారం ఆ యువకుడు కత్తితో సదరు యువతి గొంతు కోసి దారుణానికి ఒడికట్టాడు. ఆమెను వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిసింది.