లీటరు పెట్రోల్ రూ.75కు తగ్గించే ఛాన్సు

పెట్రోల్.. డీజిల్ మీద వ్యాట్ విధానంలో పన్నును వేయటమే ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పాలి. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా అన్ని వస్తువుల పైనా జీఎస్టీ విధిస్తున్నారు. పెట్రోల్.. మద్యం ఈ రెండింటిని మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాకుండా.. వ్యాట్ లోనే ఉంచేశారు. పెట్రోల్.. డీజిల్ ను ఎప్పుడైతే వ్యాట్ నుంచి జీఎస్టీకి బదిలీ చేస్తారో.. వెను వెంటనే లీటరు పెట్రోల్ రూ.75.. డీజిల్ రూ.68గా మారిపోతుంది. ఎందుకంటే.. జీఎస్టీ గరిష్ఠంగా 28 శాతానికే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ పన్ను విధించే అవకాశం లేదు.