6న ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన?

ఖమ్మం : పల్లె, పట్టణ ప్రగతి కార్యాచరణలో భాగంగా ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ నెల 6న కానీ, లేదా 10వ తేదీలోగా ఏదో ఒకరోజున ఆయన పర్యటించే అవకాశముంది. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మధిర, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ప్రగతి కార్యాచరణ అమలుపై ఆరా తీశారు. ఈ మేరకు జిల్లాలో పర్యటన ఖరారైనట్లు తెలిసింది.