7న రేవంత్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన ఎనుముల రేవంత్ రెడ్డి ఈనెల 7వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజు ముందుగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం నాంపల్లి దర్గాకు వెళ్తారు. అక్కడి నుంచి గాంధీభవన్ కు వెళ్లి బాధ్యతలు స్వీకరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.