సికింద్రాబాద్ లో రైలు కింద పడి హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం

రచ్చబండ : సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు కింద పడి నగరానికే చెందిన ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

బంజారా హిల్స్ ప్రాంతానికి చెందిన రాములు గౌడ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు.

దీంతో మనస్తాపంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన సికింద్రాబాద్- లాలాపేట నడుమ రైల్వే స్టేషన్ల మధ్యలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.