చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది మృత్యువాత

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : చైనా దేశంలోని నైరుతి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించగా, పలువురు క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో ఇదే అతి పెద్దదని అక్కడి అధికారులు తెలిపారు.

నైరుతి చైనాలోని గుయిజా ప్రావిన్స్ హైవేపై ప్రయాణిస్తున్న ఓ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 27 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయ్యాయి. వారందరినీ సమీప ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు.