ఏరువాకా సాగారో..

ఖమ్మం : ఏరువాకా.. సాగారో..రన్నో చిన్నన్నా.. అన్న పాట గుర్తుకు తెచ్చారు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు. వ్యవసాయ పనులు ప్రారంభమైన సందర్భంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం ముచ్చారం గ్రామానికి మంగళవారం వెళ్లిన సందర్భంగా పొలాల్లో రైతులు కనిపించారు. అటుగా వెళ్తున్న రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పొలంలోకి దిగారు. రైతులతో కలిసి వరి విత్తనాలు చల్లారు.