మునుగోడు గీత కార్మికులకు ఆఫర్.. నేడు పొట్టి తాటి విత్తనాల పంపిణీ

రచ్చబండ, నల్లగొండ : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని కల్లు గీత సొసైటీలకు బిహార్ పొట్టి తాటి విత్తనాలను మంగళవారం పంపిణీ చేయనున్నారు. బీఎల్ఆర్ ఫౌండేషన్, నంద సేవా సమితి సంయుక్తాధ్వర్యంలో విత్తనాలను పంపిణీ చేయనున్నారు.

భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసుకొచ్చిన విత్తనాలు పలుచోట్ల నాటనున్నారు. వీటిని కల్లు గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ఉన్న శ్రీ కంఠ మహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తాటి విత్తనాలను పంపిణీ చేయనున్నారు. కల్లుగీత కార్మిక సంఘాలు, గీత సొసైటీల సభ్యులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా భోజన వసతి కూడా ఉందని తెలిపారు.