రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యాడు. 30 ఏళ్ల వయసున్న సతీస్ అనే కానిస్టేబుల్ మృతి చెందాడు.

జిల్లాలోని మద్దిరాల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మట్టిపెల్లి సతీశ్ (30) తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 365వ నెంబర్ జాతీయ రహదారిపై తుంగతుర్తి, వెలుగుపల్లి మధ్యన జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందాడు.