- ప్రపంచస్థాయి అథ్లెటిక్స్ ట్రిపుల్ జంప్ పోటీల్లో సిల్వర్ మెడల్
- శంకర్ పల్లిలో ఆర్డీవో వేణుమాధవ్ రావుకు ఘనసన్మానం
రచ్చబండ, శంకర్ పల్లి: ఇటీవల నార్త్ కొరియాలో జరిగిన అథ్లెటిక్స్ ట్రిపుల్ జంప్ పోటీల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రెవెన్యూ డివిజనల్ అధికారి వేణుమాధవరావు విశేష ప్రతిభ చాటారు. సిల్వర్ మెడల్ సాధించి శభాష్ అని నిరూపించుకున్నారు.
ఈ మేరకు శంకర్ పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో జరిగిన అథ్లెటిక్స్ పోటీలలో మన చేవెళ్ల ఆర్డిఓ వేణుమాధవ్ రావు మెడల్ సాధించడం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నయీముద్దీన్, సీఐ ప్రసన్నకుమార్, ఎంఆర్ఐ తేజ, రెవెన్యూ సూపరిండెంట్ పవన్, జూనియర్ అసిస్టెంట్ ప్రియా, రంగారెడ్డి జిల్లా సిపిఎస్ ఎండీ తాహెర్ అలీ, పిఆర్టియు శంకర్ పల్లి మండల అధ్యక్షులు ఎం రాజశేఖర్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.