తెలంగాణలో బోనాల డేట్ ఫిక్స్

తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ బోనాలకు వేళయింది. భాగ్యనగరానికి తలమానికంగా నిలిచే బోనాల ఉత్సవాల డేట్స్ ఫిక్సయ్యాయ. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించనుంది.

ఈనెల 30 నుంచి ఆషాడ బోనాలు షురూ కానున్నాయి. 30న గోల్కొండలో అమ్మవారి బోనాల పండుగతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. వచ్చే నెల 17న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుగుతాయి.

ఆ మరునాడే అంటే జూలై 18న రంగం ఉంటుంది. జూలై 24, 25 తేదీల్లో లాల్ దర్వాజా బోనాల వేడుకలు జరగనున్నాయి. ఈనెలాఖరు నుంచి వచ్చే నెల మొత్తం హైదరాబాద్ మహా నగరం బోనాల వేడుకలతో సందడి నెలకొంటుంది. నగరమంతా కోలాహలం ఉంటుంది. భక్తిభావం ఉప్పొంగుతుంది.