శంకర్ పల్లి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా బొల్లారం ప్రవళికా వెంకటరెడ్డి

శంకర్ పల్లి మండల పరిషత్ వైస్ ఎంపీపీగా బొల్లారం ప్రవళికా వెంకటరెడ్డి
* డీఎల్పీవో సతీష్ సమక్షంలో ఏకగ్రీవ ఎన్నిక
రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా పొద్దుటూరు గ్రామ ఎంపీటీసీ బొల్లారం ప్రవళికా వెంకట్ రెడ్డి బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వైస్ ఎంపీపీ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మిర్జాగూడ గ్రామ ఎంపీటీసీ కురుమ రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ పదవి ఖాళీగా ఉండిపోయింది. కాగా సుమారు 8 నెలల తర్వాత ఈ వైస్ ఎంపీపీ ఎన్నికలు జరిగింది. చేవెళ్ల డీఎల్పీవో సతీష్ ఈ ఎన్నికను నిర్వహించి వైస్ ఎంపీపీగా ప్రవల్లిక ఎంపికైనట్టు ప్రకటించి ఆమెకు నియామకపత్రాన్ని అందించారు. మండలంలో మొత్తం 13 ఎంపీటీసీ సభ్యులు ఉండగా అందులో టంగుటూరు, మిర్జాగూడ గ్రామాల ఎంపీటీసీలు మృతి చెందారు. కాగా బుధవారం జరిగిన ఎన్నికకు 9 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. మహాలింగాపురం ఎంపీటీసీ యాదగిరి బొల్లారం ప్రవళికా వెంకట్ రెడ్డి పేరును వైస్ ఎంపీపీగా ప్రతిపాదించగా, పరివేద ఎంపీటీసీ వెంకట్ రెడ్డి బలపరిచారు.

శంకర్ పల్లి మండల సమగ్రాభివృద్ధికి పాటుపడుతా: ప్రవళికా వెంకటరెడ్డి
ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతూ తనను శంకర్ పల్లి మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎంపికకు సహకరించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. మండల గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి అందిస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కాగా ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జెడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి వైస్ ఎంపీపీ ప్రవళికను శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు పలు గ్రామాల ఎంపీటీసీలు,మున్సిపల్ కౌన్సిలర్లు, శంకర్ పల్లి మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, నాయకులు వైస్ ఎంపీపీని శాలువులతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకయ్య, ఎంపీఓ గీత, సూపరిండెంట్ రవీందర్, ఏపీవో నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.